Sunday, January 19, 2025
Homeతెలంగాణహాలియా లో.. సాగర్ ఉప ఎన్నికల ప్రచార సభ.. ...

హాలియా లో.. సాగర్ ఉప ఎన్నికల ప్రచార సభ.. …

ఈ సభకు హాజరుకాకుండా,, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్…

ప్రజాస్వామ్యం లో ఇలాంటి పోకడలు ఆమోదయోగ్యం కాదు…..

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు సమావేశం లు,సభలు నిర్వహిస్తున్నాయి..కానీ ఇక్కడ ప్రతిపక్షాలకు విచిత్రమైన పరిస్థితి ఉన్నది…….

ఎవరు మంచి చేస్తున్నారో,, ఎవ్వరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలే సమీక్షలు చేసుకోవాలి……….

ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో వారినే గెలిపించండి…….

నోముల భగత్ విద్యావంతుడు,, యువకుడు ,,మంచి విజన్ ఉన్న వాడు.. భగత్ గాలి బాగానే ఉన్నది….

నెల్లికల్లు లిఫ్ట్ లో నీళ్లు పారిస్తాం………

మంత్రి జగదీష్ రెడ్డి దమ్మున్న మాట మాట్లాడిండు… నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి మంచి మాట మాట్లాడిండు….. నిను సమర్థిస్తా…..ఎట్టి పరిస్థితి ల్లో పూర్తి చేస్తాం…

జానారెడ్డి 30 ఏళ్ల ప్రస్థానం అంటారు…చేసింది మాత్రం ఎం లేదు…. ఎక్కడి గొంగళి అక్కడే ఉంది..
సాగర్ డ్యామ్ ప్రాంతం అనదఃలా ఉండేది….ఇప్పుడు మున్సిపాలిటీ ని చేసినం……..

సాగర్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెట్టించలేక పోయారు జానారెడ్డి… నిను హాలియా లో డిగ్రీ కాలేజ్ ను మంజరు చేస్తున్నా…….మరో డిగ్రీ కాలేజ్ ను కూడా మంజూరు చేస్తా…

సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలు… కాంగ్రెస్ వాళ్లు కాదు… కాంగ్రెస్ వాళ్లు బిచ్చగాళ్ల… పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర వారిది…..సమైక్యాంధ్ర నాయకుల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ వారిది….

ఉద్యమం మొదలుపెట్టిన నాడే చెప్పిన పదవులను గడ్డి పోచల లెక్క వేసిరేసినం….

తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన చరిత్ర TRS ది….

మంచి ఎదో గమనించాలి….

మీ గ్రామాల్లో పథకాలు వస్తున్నాయి కదా.. ఆలోచన చేయండి….

రైతు బంధు ద్వారా రైతు కాలం చేస్తే 5 లక్షలు అందిస్తున్న ఘనత TRS ది… పారదర్శకత మా విధానం…. ఎవ్వరి ప్రమేయం లేకుండా మీ ఖాతల్లో డబ్బులు వేస్తున్నాం…

ధరణి పోర్టల్ ఓ చరిత్ర…
నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం….

ఫ్లోరైడ్ భూతాన్ని పెంచి పోషించారు కాంగ్రెస్ నాయకులు…
ఫ్లోరైడ్ పైన నేనే పాటలు రాసిన… ఇవ్వాళ ఇంటింటికి భగీరథ నీళ్ళ వస్తూన్నాయి ….ఆ నీళ్లలో కేసీఆర్ ను చూస్తున్నారు ప్రజలు…

25 వేల కోట్లు ఖర్చు పెట్టి 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నాం….ఇది నిజం కాదా…

ఈ ఎండాల్లో చెక్ డ్యామ్ లాల్లో నీళ్లు సందడి చేస్తున్నాయి…

రేపు నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేసుకొని ఇక్కడ కూడా నీళ్లు పారిస్తాం……….

జానారెడ్డి ఏడ పన్నాడో తెలియదు… తెలంగాణ నాశనం అవుతున్న కూడా పదవుల కోసం వంగి నంగి ఉన్న చరిత్ర వీరిది……

ఇప్పుడు తలసరి ఆదాయం పెరిగింది……

మంచి చేసే వాళ్ళను గెలిపిస్తే ఇంకా మంచి జరుగుతుంది….

గులాబీ జెండా పుట్టాక ముందు తెలంగాణ అనాధ ల ఉండేది…. దానికి కారణం కాంగ్రెస్ వాళ్లు ..

నాకు ఏ బలం లేకున్నా తెగించి కొట్లాడిన……

కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ తెచ్చుడో అని కొట్లాడి రాష్టాన్ని తెచ్చిన…….

అస్సలు కేసీఆర్ హాలియకు రావొద్దు అని కోర్ట్ కు పోయిండ్రు.. కుట్రలు చేసిండ్రు కాంగ్రెస్ వారు….

సాగర్ డ్యామ్ కూడా కట్టాల్సిన చోట కట్టలేదు.. అన్యాయం జరిగింది…..

ఉద్యోగుల కు కూడా మంచి PRC ఇచ్చిన ఏకైక ప్రభుత్వం TRS ప్రభుత్వం….

గతంలో గ్రామాలు వల్లకాడు లాగా వుండే,, ఇప్పుడు సుందరికారణగా చేసినం….

ప్రకృతి వనాలతో గ్రామాలు ఆహ్లాదకరంగా మారాయి…..

గిరిజన సోదరులు ఆలోచన చెయ్యాలి…. తాండలను గ్రామ పంచాయతీ లుగా మార్చినము…….

రెండో పేజ్ లో కూడా 3 లక్షల మంది కి గొర్రెల యూనిట్ లు ఇస్తాం.. సబ్సిడీ పెంచుతాం…….

భగత్ ను గెలిపించండి… MC కోటిరెడ్డి ని MLC ని చేస్తా… అభివృద్ధి పరుగులు పెడుతుంది….

మళ్ళీ 20 రోజుల్లో ఇక్కడికి వస్తా.. ఇక్కడ అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా….

నల్గొండ జిల్లాలో మంజూరు చేసిన అన్ని లిఫ్ట్ లు పూర్తి చేసి చూపిస్తా….

భగత్ విజయం ఖాయం అయింది……

పొడు భూముల సమస్యలు పరిష్కారం చూపిస్తా…… ప్రజాదర్భర్ పెట్టి సమస్య ను పరిష్కరిస్తా…….

RELATED ARTICLES

Most Popular

న్యూస్