భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతు కూలీ సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో ఏ సి డి పేరుతో అదనపు విద్యుత్ చార్జీలను వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా నిర్వహించారు. ధర్నాను అనుద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు హామీని తుంగలో తొక్కి గృహ వినియోగదారులపై. సన్నాఛిన్నకారు మధ్యతరగతి రైతాంగంపై మోయలేని విద్యుత్ పన్నుల భారాన్ని మోపుతూ ఏసీడీ పేరుతో అడ్వాన్స్ చార్జీలను వసూలు చేయుటకు విద్యుత్ సంస్థకు అధికారాలు జారీ చేయడం కెసిఆర్ ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని పెంచి నియంతృత్వంగా అమలు చేయాలని పూనుకుంటే ఆ ప్రభుత్వానికి ఏగతి పట్టిందో కేసీఆర్ కు తెలియంది కాదన్నారు.
కరెంటు వినియోగదారులపై అధిక భారాలను వేసే ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల ఉచిత కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయాలని. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని రకరకాల ముద్దు పేర్లతో విధించే అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఎసిడి పేరుతో అడ్వాన్స్ చార్జీలను ఉపసంహరించుకునే అంతవరకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం మండల ప్రధాన తోకల వెంకన్న అధ్యక్ష వహించగా. మెంగుభగవాన్. గండెలపునేష్ స్వర్ణపాక సీతారాములు. షేరు ఉపేందర్. సింగు ఎర్రయ్య ఎర్రమళ్ళ వెంకన్న .ఏర్ని వెంకటేష్. ఖుషిని వెంకన్న. జక్కుల బాలకృష్ణ. ఇస్లావత్ మంగీలాల్. ఇస్లావత్ రాము. వల్లాల మధు. సిర్ర వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.