Wednesday, March 18, 2026
Homeసినిమాచెప్పిన టైమ్ కే వస్తానంటున్న 'ఆదిపురుష్'

చెప్పిన టైమ్ కే వస్తానంటున్న ‘ఆదిపురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌‘. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడుగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన ఆదిపురుష్‌ టీజర్ పై విమర్శలు రావడంతో మేకర్స్ గ్రాఫిక్స్ పై మరోసారి వర్క్ చేస్తున్నారు. ఇలా మళ్లీ వర్క్ చేయడం వలన దాదాపు 100 కోట్లు అదనంగా బడ్జెట్ పెరుగుతుంది.

అయినప్పటికీ క్వాలిటీ బాగుండాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ మళ్లీ వర్క్ చేస్తున్నారు. అందుకనే ఈ జనవరి 12న రిలీజ్ చేయాలి అనుకున్న ఆదిపురుష్‌ వాయిదా పడింది. జూన్ 16వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఆదిపురుష్ టీం ప్రకటించింది. అయితే.. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అని ప్రకటించారు. అంటే రెండు నెలల గ్యాప్ లో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయనున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఆదిపురుష్, సలార్ ఈ రెండు చిత్రాలకు ఎక్కువ గ్యాప్ ఉంటుందని.. ఎట్టి పరిస్థితుల్లోనే ఆదిపురుష్‌ జూన్ 16న విడుదల కాదని.. 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.

దీంతో ఆదిపురుష్ వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఈ క్రమంలోనే #150DaystoAdipurush అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమాను ట్రెండ్ చేయడం ప్రారంభించారు మేకర్స్. ఈ విధంగా జూన్ 16న ఆదిపురుష్‌ రిలీజ్ అని మరోసారి కన్ ఫర్మ్ చేశారు. అయితే… ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో దీనికి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో రిలీజ్ చేసిన టీజర్ పై విమర్శలు రావడంతో సినిమా వీఎఫ్ఎక్స్ ను మార్చారు మూవీ మేకర్స్. ఆ పని పూర్తి కావడంతో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ సినిమాను ట్రెండ్ చేయాలనుకున్నారు. కానీ కొత్త ట్రైలర్ కు బదులుగా ఇలాంటి హ్యాష్ టాగ్స్ ఇవ్వడంతో ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. మరి.. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular