Tuesday, June 16, 2026
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ అసలు వస్తుందా..?

అఖిల్ ఏజెంట్ అసలు వస్తుందా..?

అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలాకాలంగా సాగుతూ వస్తోంది. ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ప్రమోషన్స్ లో స్పీడు మాత్రం కనిపించడం లేదు. దీంతో అక్కినేని అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయమై రోజుకో వార్త బైటకు వస్తోంది. ఒక పాట, ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది.

తాజాగా మరో వార్త ప్రచారంలో ఉంది.  కొచ్చి, ముంబాయిల్లో ప్యాచ్ వర్క్ వుందట. అది ఈ వారంలో పూర్తవుతుందని  అంటున్నారు. ఒక పాట షూట్ బ్యాలెన్స్ వుందని టాక్ వచ్చింది కానీ.. ఒకటి కాదు.. రెండు పాటలు షూట్ బ్యాలెన్స్ ఉందని వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా వుంటే సిజి వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. ఫస్టాఫ్‌ రీ రికార్డింగ్ పూర్తయిందట. సెకండాఫ్ కు ఆర్ఆర్ అందివ్వాలి అని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. టైమ్ తక్కువ ఉంది.. చేయాల్సిన పని ఎక్కువ ఉంది అనిపిస్తుంది.

పైగా ‘ఏజెంట్’ పాన్ ఇండియా మూవీ. దీనికి చాలా ప్రమోషన్స్ చేయాలి. ఇండియా అంతా తిరగాలి. బజ్ తీసుకురావాలి అంటే.. ఇంత స్లోగా ఉంటే కుదరదు. అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏజెంట్ మూవీతో ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. అఖిల్ బాడీ చూసి వావ్ అనాల్సిందే. అంతలా కష్టపడితే… ఏజెంట్ మూవీ సరైన ప్రమోషన్ లేక బజ్ కోసం కష్టపడుతుంది. మరి.. ఏజెంట్ అంతా అనుకున్నట్టుగా జరిగి 28న వస్తుందో.. మళ్లీ వాయిదా పడుతుందో.. చూడాలి.

Also Read :  Agent Pre Release: ‘ఏజెంట్’ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular