Tuesday, June 16, 2026
Homeసినిమాఅల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబో ఫిక్స్?

అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబో ఫిక్స్?

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. త్వరలో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి బడ్జెట్ ఇంత అంటూ ఎలాంటి పరిమితులు లేకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అవతార్ మూవీతో పాటుగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. త్వరలో పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. అయితే.. యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ విక్రమ్ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో లోకేష్‌ కనకరాజ్ కు డిమాండ్ బాగా పెరిగింది. అయితే.. లోకేష్ కనకరాజ్ తో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అని వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ విజయ్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఖైదీ 2 సినిమా చేయాలి. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుందని అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నాడు. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆతర్వాత బ్యాంకాక్ లో షూటింగ్ చేయనున్నారు. అయితే.. ఈ చిత్రం పూర్తి అయ్యే సమయానికి లోకేష్ తన చిత్రాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా బన్నీ, లోకేష్ కాంబో ఉంటుంది అని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ఇక అభిమానులకి పండగే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular