సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ మూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. మహేష్ ఇంకా త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ చేయకపోవడంతో జక్కన్నతో మూవీ కాస్త ఆలస్యం అవుతుంది. ఈ చిత్రాన్ని జూన్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.
ఇదిలా ఉంటే… ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారని.. అది మహేష్ తండ్రి పాత్ర అని టాక్ వినిపిస్తోంది. అలాగే మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య మహేష్ కి విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇంతకీ ప్రచారంలో ఉన్నది వాస్తవమా అంటే.. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు అని తెలిసింది.
కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలో తండ్రి పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో అమితాబ్ నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం. ఇక విజయేంద్రప్రసాద్, మహేష్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఆయన ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 2023 జూన్ లో స్టార్ట్ అయ్యే ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారు జక్కన్న.