Tuesday, March 17, 2026
HomeTrending Newsఅబ్దుల్ నజీర్ తో సిఎం దంపతుల భేటీ

అబ్దుల్ నజీర్ తో సిఎం దంపతుల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అబ్దుల్ నజీర్ రేపు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయిస్తారు. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.  నిన్న రాత్రి జస్టిస్ నజీర్ దంపతులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్ళారు.

Also Read : నజీర్‌ మార్గనిర్దేశంలో మరింత పురోగమిస్తాం: సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular