Tuesday, March 17, 2026
Homeసినిమాతెలుగులో అషిక అలరించేనా?

తెలుగులో అషిక అలరించేనా?

ఒకప్పుడు టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల జోరు ఎక్కువగా కనిపించేది. గ్లామర్ ఒలకబోసే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వాళ్ల వైపు నుంచి ఉండని కారణంగా, ఇక్కడి తెరపై వాళ్ల జాతరే కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత మలయాళ భామలు తమ గ్లామర్ తోను .. నటనతోను ఆకట్టుకుంటూ, తమ పట్టు బిగిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ మలయాళ బ్యూటీలదే రాజ్యం. ఆ తరువాతే కోలీవుడ్ నాయికలు ఈ వైపుగా దృష్టిపెట్టారు.

ఇటీవల కాలంలో కన్నడ సినిమా కూడా తన పరిథిని పెంచుకుంది. టాలీవుడ్ కి మరింత చేరువైంది. అక్కడి సినిమాలు ఇక్కడ విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి నుంచి హీరోయిన్ల రాక మొదలైంది. రష్మికలాంటి వారు కన్నడంతో పాటు తెలుగులోనూ ఆ స్థాయి స్టార్ డమ్ ను అందుకున్నారు. నిజం చెప్పాలంటే అక్కడికి మించి ఇక్కడ పాప్యులర్ అయ్యారు. ఆమె పాన్ ఇండియా స్టార్ కావడానికి కారణం కూడా తెలుగు సినిమానే.

ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది … ఆ సుందరి పేరే ‘ఆషిక రంగనాథ్. కన్నడ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ఆషిక,  కల్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’ తో టాలీవుడ్ కి పరిచయమవుతోంది. చందమామ వంటి మోము … చక్కని కనుముక్కుతీరు .. కట్టిపడేసే నవ్వు ఆమె సొంతం. ఈ సినిమా రిలీజ్ తరువాత ఆమె ప్రభావం ఇక్కడ ఉంటుందనే మాటైతే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలా జరుగుతుందేమో చూడాలి మరి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అమిగోస్’ తో పరిచయమవుతున్న అందాల రాశి! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular