Sunday, February 23, 2025
HomeTrending NewsKurnool tour: ఒక్క కనుసైగతో.....: బాబు వార్నింగ్

Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్

Capital Fight: ‘నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను… వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి బట్టలిప్పించి కొట్టిస్తా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను ఒక కనుసైగతో వైసీపీ వాళ్ళ బట్టలూడదీయిస్తా అంటూ ఫైర్ అయ్యారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు హోటల్ మౌర్య ఇన్ లో బస చేశారు. పరిపాలనా వికేంద్రీకరణపై వైఖరి చెప్పాలంటూ న్యాయవాదులు, వైసీపీ కార్యకర్తలు హోటల్ మౌర్య ఇన్ లో బస చేసిన చంద్రబాబును  డిమాండ్ చేశారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బాబు గో బ్యాక్ అంటూ అంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు.వారిపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారు, ఎవరు ద్రోహం చేస్తారనేది మేధావులు కూడా ఆలోచించాలన్నారు.

తనను రెచ్చగొడుతున్నారని, వారి పతనం ఖాయమని, తాను ప్రజలకు తప్ప ఎవరికీ భయపడనని బాబు స్పష్టం చేశారు. రెండ్రోజులుగా జిల్లాలో పర్యటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, జేజేలు పలికారని, ఇది చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని, అందుకే కొంతమంది చెత్తగాళ్ళను పంపి టిడిపి కార్యక్రమాలకు ఆటకం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలుగు తమ్ముళ్ళు కన్నెర్ర చేస్తే పారిపోవడం ఖాయమన్నారు.  కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని తాను ఎప్పుడో చెప్పానని, అప్పుడు నువ్వు అడిగావా అంటూ సిఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు.  గతంలో అమరావతి రాజధానికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను ఎందాకైనా వెళ్తానని బాబు భరోసా ఇచ్చారు. అవసరమైతే కర్నూలులోనే ఉంటానని అంతు చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతానని బాబు వార్నింగ్ ఇచ్చారు.

Also Read: రాయలసీమ ద్రోహి చంద్రబాబు :హఫీజ్ ఖాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్