Friday, June 12, 2026
Homeసినిమా'మైఖేల్' థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన బాలకృష్ణ

‘మైఖేల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన బాలకృష్ణ

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మైఖేల్‘. సందీప్ తొలి పాన్ ఇండియా చిత్రం రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ తో ఆశ్చర్యపరిచారు మేకర్స్. మైఖేల్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బాలకృష్ణ మైఖేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమ లేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా తనతో ప్రేమలో పడితే, హార్ట్ బ్రేక్ అవుతుందని హెచ్చరిస్తుంది. యంగ్ సందీప్ కిషన్ ఒకరిని తుపాకీతో కాల్చడంతో ట్రైలర్ ముగుస్తుంది. విజయ్ సేతుపతి వార్నింగ్ ఇస్తూ కనిపించడం ట్రైలర్ కి మరింత సీరియస్ నెస్ ని తీసుకొచ్చింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారికి మైఖేల్ ట్రైలర్ చాలా నచ్చంది. ట్రైలర్ చూసి ‘’అదిరిపోయింది’ చెప్పారు. మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇంత కష్టపడటానికి ఎనర్జీ ఇచ్చింది ప్రేక్షకులే. మనం చేసే పనికి కొందరు అభిమానులు వుంటారు. మనం కాస్త నిరాశలో వున్నప్పుడు వాళ్ళే మనకి ఎనర్జీ ఇస్తూ వుంటారు. ఆ ఎనర్జీ నుంచే కొన్ని మ్యాజికల్ మెంటల్ సినిమాలు పుడుతూ వుంటాయి. అలాంటి ప్రయత్నమే మైఖేల్. ఇది పూర్తిగా తెలుగు సినిమా. మన సినిమా. మనమందరం గర్వపడే సినిమా. రంజిత్ అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు ఇప్పటివరకూ ఎప్పుడూపెట్టని బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టారు. ఎప్పుడూ చేయని బిజినెస్ చేశారు. మీ అందరి ప్రేమ కావాలి’’ అని కోరారు.

Also Read : ఫిబ్రవరి 3న ‘మైఖేల్’ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular