Sunday, June 14, 2026
Homeసినిమాశాశ్వతంగా నిలిచే సినిమా 'వీరసింహారెడ్డి' - బాలకృష్ణ

శాశ్వతంగా నిలిచే సినిమా ‘వీరసింహారెడ్డి’ – బాలకృష్ణ

బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి‘. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన రావడంతో వీరసింహారెడ్డి మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో శృతి హాసన్ అద్భుతంగా నటించింది. అలాగే దునియా విజయ్ కర్నాటకలో హీరో అయ్యుండి కూడా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. పాత్రకు తగ్గట్టుగా చాలా బాగా నటించాడు. రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహా, లెజెండ్, అఖండ.. చిత్రాలు ఎలా అయితే కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాలుగా నిలిచాయో అలాగే వీరసింహారెడ్డి చిత్రం కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి అందర్నీ ఆకట్టుకుంటుంది. అభిమానులతో ఎప్పటికీ విడదీయలేని అనుబంధం. జన్మజన్మల బంధం.. డబ్బుతో కొనలేనది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular