Saturday, January 18, 2025
HomeTrending Newsదేశ ఐక్యత కోసమే భారత్ జోడో యాత్ర - దిగ్విజయ్ సింగ్

దేశ ఐక్యత కోసమే భారత్ జోడో యాత్ర – దిగ్విజయ్ సింగ్

భారత్ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదు.. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. జోడో యాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర నేతలతో హైదరాబాద్ లో దిగ్విజయ్ సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జోడో యాత్ర తెలంగాణలో జరిగే 13 రోజులు ప్రతి కార్యకర్త జోడో యాత్ర పనిలోనే ఉండాలన్నారు. తెలంగాణ లో యాత్ర పూర్తి కాగానే మన పని అయిపోయినట్టు కాదని, రాహుల్ గాంధీ కాశ్మీర్ కు చేరే వరకు రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేరేలా కార్యకర్తలు పాటు పడాలని సూచించారు. రాష్ట్ర కన్వీనర్ తో పాటు జిల్లా. నియోజక వర్గ, మండల, గ్రామ, బూత్ స్థాయి వరకు కన్వీనర్ లను నియమించి జోడో యాత్ర లక్ష్యాలను ఇంటింటికి చేర్చాలి.

దేశంలో మోడీ ప్రభుత్వం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ప్రజలపై నోట్ల రద్దు, జిఎస్టీ, కరోనో ఆర్థిక మాంద్యం తదితర వాటితో దేశంలో ప్రజలు ఆర్థిక భారం పడి.. జీవితాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని… కాంగ్రెస్ పార్టీ ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర చేసిందని మండిపడ్డారు. ప్రజల్లోకి రాహుల్ గాంధీ యాత్ర ను బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలని, రాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తెలంగాణలో కూడా ప్రజల నుంచి మద్దతు బలంగా ఉంటుంది.. వారి మద్దతుతో రాహుల్ గాంధీ యాత్రను పెద్దఎత్తున విజయవంతం చేయాలని నేతలకు స్పష్టం చేశారు.

రాజ్యాంగం అనేది అందరికీ ఒకే రకమైన హక్కులు కల్పించిందని, పేదవాడి మరింత పేదవాడు అవుతున్నాడని దిగ్విజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వాళ్లకు ఉపయోగ పేదే విధంగా పాలన సాగుతోందని, నోట్ల రద్దు నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వరకు అన్ని కుట్ర పూరితంగా జరుగుథున్నాయని ఆరోపించారు. మోడీ,అమిత్ షా ప్రభుత్వం పేదల మీద ఆధిపత్యం చూపిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశం కోసం చేస్తున్న యాత్ర అని శాంతి కోసం చేస్తున్న యాత్ర అన్నారు. శాంతి లేక పోతే అభివృద్ధి లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Also Read : తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్