Thursday, March 19, 2026
HomeTrending Newsపాడి రైతులకు బోనస్ విడుదల

పాడి రైతులకు బోనస్ విడుదల

కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌  నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.  7.20 కోట్ల రూపాయల బోనస్‌ చెక్‌ను కర్నూలు మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ ఎస్‌.వి. జగన్‌ మోహన్‌ రెడ్డి సిఎం జగన్ కు అందజేశారు.  పాడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద వల్ల తమ సహకార సమితి రెండేళ్ళలో రూ. 27 కోట్లు లాభాలు గడించిందని ఎస్వీ వెల్లడించారు.  కర్నూలు మిల్క్‌ యూనియన్‌ సమగ్ర పనితీరును వివరించి, రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ది చేసి ముందుకు తీసుకెళతామని సీఎంకి చైర్మన్, ఎండీ, డైరెక్టర్‌లు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) చైర్మన్‌ ఎస్‌.వి. జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎండీ పరమేశ్వర రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్, సొసైటీ డైరెక్టర్లు జి. విజయ సింహా రెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్‌. సరళమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular