Saturday, June 13, 2026
Homeసినిమాఅల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో  కొత్త ఫిల్మ్ స్టూడియో – అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.  అదే రోజు  కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లోని గండిపేట్‌లో 10 ఎకరాల్లో  అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని అందించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరి నటులు దివంగత అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.

అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, అల్లు కుటుంబం మొత్తంతో కలిసి ఈ స్టూడియోలను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించనున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని సినిమా షూటింగులకి అల్లు స్టూడియో కేరాఫ్ అడ్రెస్ గా మారనుంది. అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్ చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular