Monday, March 16, 2026
HomeTrending Newsఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ : సిఎం సంతాపం

ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ : సిఎం సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.  ఆంధ్రా జేమ్స్ బాండ్ గా అసంఖ్యాక ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్నారని తన సందేశంలో పేర్కొన్నారు.  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఎన్నో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో  ఆయన ఒదిగిపోయారని, ఆ పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమని అభివర్ణించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు, కుమారుడు మహేష్ బాబుకు సిఎం జగన్ ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

Also Read : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular