Thursday, June 11, 2026
HomeTrending Newsనిర్వాసితులకు అండగా ఉండాలి : సిఎం జగన్

నిర్వాసితులకు అండగా ఉండాలి : సిఎం జగన్

అనంతపురంలో వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు.  హఠాత్తుగా కుండపోత, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలు తెలిపిన అధికారులు.

బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని,  దీంతోపాటు బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని ఆదేశించారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular