Monday, March 16, 2026
HomeTrending Newsత్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్‌

త్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్‌

ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని వెల్లడించారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు ఈ రోజు Diplamat outreach program సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమీషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో యంగెస్ట్‌ రాష్ట్రమైన తెలంగాణ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.

Diplomatic

తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగవుతున్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల‌, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు. ఫార్మస్యూటికల్‌ హబ్‌, బయోసైన్స్‌ హబ్‌గా ఉందని చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్‌ విడిభాగాలు ఇక్కడే తయారవుతాయని వెల్లడించారు.

15 వందలకుపైగా మల్టీనేషన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్‌ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించాయని వెల్లడించారు. ప్రపంచంలో భారత్‌ నంబర్‌ వన్‌లో ఉండాలంటే ఇన్నేవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌నెస్‌ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు.

Also Read: టీ హ‌బ్ నేష‌న‌ల్‌ రోల్‌మోడ‌ల్‌: సీఎం కేసీఆర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular