Thursday, June 11, 2026
Homeసినిమాభారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం 'సార్'

భారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం ‘సార్’

ప్రముఖ భారతీయ దర్శకుడు భారతీరాజా ధనుష్ నటించిన తాజా చిత్రం ‘వాతి'(‘సార్’) పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా, విద్యను ప్రోత్సహించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణించారు. “నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో ‘సార్’ ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను, నేను ఇందులో భాగమైనందున ఇది ప్రత్యేకమైనది. సినిమాలు వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో వాతి ఒకటి. వాతిలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు” అని భారతీరాజా ప్రకటనలో తెలిపారు.

ధనుష్ బాధ్యతాయుతమైన దృష్టిని భారతి రాజా ప్రశంసించారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన సముద్రఖని, టీచర్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయిన సంయుక్త గురించి కూడా ఆయన ప్రశంసించారు. ‘సార్’ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం జివి ప్రకాష్ కి రావడం ఆయనకు ఆశీర్వాదం. ఆయన ఈ సంవత్సరం అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఏడాది ఆయన జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం. సార్ / వాతి అనేది గొప్ప టైటిల్, ఈ చిత్రం ఉపాధ్యాయుని సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతుంది.” అని భారతీరాజా అన్నారు.

ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని భారతి రాజా ప్రజలను కోరారు. “నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు బాగుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఇదొకటి. వాతి థియేటర్‌లో తప్పక చూడవలసిన చిత్రం. మీరు ఈ సినిమాని థియేటర్లలో చూసి, ఆ అనుభూతిని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు భారతీరాజా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ధనుష్, సముద్రఖని, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 17, 2023న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Also Read : ‘సార్’ కు ఇంత మంచి స్పందన రావడం గర్వంగా ఉంది – వెంకీ అట్లూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular