Thursday, March 19, 2026
Homeసినిమా‘దోచేవారెవరురా..’ సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

‘దోచేవారెవరురా..’ సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు కొత్త సినిమా ‘దోచేవారెవరురా..’. నూతన నటీనటులతో నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని బొడ్డు కోటేశ్వరరావు నిర్మించారు. సరికొత్త కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన‌ ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు. ఈ పాట ను రమ్య బెహర్ అద్భుతం గా పాడింది.

ఈ సినిమా లో ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది. తాజాగా ఈ సినిమాలోని గుండాగాళ్లమండి.. లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా శివ నాగేశ్వరరావు గారి స్టైల్ లో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular