Saturday, June 13, 2026
HomeTrending Newsసింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్  శ్రీధర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

Also Read సింగరేణి లాభం రూ.1,070 కోట్లు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular