Thursday, March 19, 2026
HomeసినిమాGame Changer: ‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్ స్టైలిష్ లుక్

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్ స్టైలిష్ లుక్

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా.. శంకర్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీకి ‘గేమ్ ఛేంజర్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది..

హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఖర్చు పెరుగుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు.. ఇటీవలే ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూట్ చేశారు.. రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు..

రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఉదయం గేమ్ ఛేంజర్ టైటిల్ ట్రీట్ ఇచ్చిన టీమ్.. మధ్యాహ్నం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.. మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు చరణ్ సూట్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.. ఈ పోస్టర్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్, గాగుల్స్‌తో బైక్ మీద కూర్చుని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది.. పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి..

టాప్ టెక్నీషియన్లతో వండర్ ఫుల్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు.. ‘గేమ్ ఛేంజర్’ నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్‌ని, టైటిల్ వీడియోని షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సినీ వర్గాల వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read : Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular