Sunday, March 15, 2026
HomeTrending Newsఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు

ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు

రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో గొప్పో కొన్నా వాటికీ డబ్బు చెల్లించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని విమర్శించారు.  ఎరువులు అధిక ధరలకు అమ్ముతారని, రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా ఇవ్వడం లేదని, డబ్బు చెల్లించే ఎరువులు కొనాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎరువులు కూడా సరిపడా అందుబాటులో ఉండడం లేదన్నారు.

రైతు భరోసా కేంద్రాలపై వివిధ దినపత్రికల్లో ఇటీవలి కాలంలో వచ్చిన వార్తల క్లిప్పింగులను షేర్ చేస్తూ ప్రభుత్వంపై  విమర్శల వర్షం కురిపించారు.

  • అధికారులు, వైసీపీ నాయకులు కుమ్ముక్కై నకిలీ రైతులను నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేసారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు తీస్తే ఎన్ని వేల కోట్లు కాజేశారో తేలుతుంది.
  • ధరల స్థిరీకరణ కు 3000 కోట్లు, విపత్తులకు 6000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వేటికీ దిక్కు లేదు. ఆర్బీకే భవనాలకు అద్దెలు కూడా సరిగా చెల్లించరు. ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదు.
  • ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారాయి.
  • అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకే ల వద్ద ఉన్నాయి? ఎంత మొత్తం ఆర్బీకే ల ద్వారా ఇచ్చారు? అలానే.. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పంట ఎంత? అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.
  • అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular