Monday, June 15, 2026
Homeసినిమా#Suhas9: సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ప్రారంభం

#Suhas9: సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ప్రారంభం

హీరో సుహాస్, శ్రీధర్ రెడ్డి తో చేతులు కలిపారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. షాలిని కొండేపూడి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందించారు.

ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. చాలా ఎక్సయిటింగా వుంది. ఇది ఒక విభిన్నమైన కథ. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. చాలా ఆసక్తికరమైన కథ రాసుకున్నాను. అంతే ఆసక్తికరంగా, యంగేజింగా షూట్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్ లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్ టైనర్ గా వుంటుంది”అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular