Friday, March 20, 2026
HomeTrending Newsఎమోషనల్ మూమెంట్ - ఎన్టీఆర్

ఎమోషనల్ మూమెంట్ – ఎన్టీఆర్

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో.. ఆకాశమే హద్దు అనేలా ఆనందంలో మునిగిపోయారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మెంబర్స్. ఎన్టీఆర్ దీని పై స్పందిస్తూ… ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు అని ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ కు అభినందనలు తెలియజేశారు ఎన్టీఆర్.

కీరవాణి, చంద్రబోస్ ఫిల్మ్ క్రిటిక్స్ అభినందనలు
ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు తెర పై ఓ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదిక పై కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరి కింద ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల రెపరెపలాడించారు ఎం ఎం కీరవాణి , చంద్రబోస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పాట రాసిన చంద్రబోస్ , సంగీతం సమకూర్చిన ఎం ఎం కీరవాణి లు ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేస్తూ , వారిని హృదయ పూర్వకంగా ప్రశంసిస్తోంది. తెలుగు సినిమాను ప్రపంచ వేదిక పైకి ఆవిష్కరించిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందిస్తోందని ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ తెలియచేశారు.

Also Read : ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులే – రామ్ చరణ్‌ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular