Sunday, November 24, 2024
HomeTrending NewsNikhat Zareen: గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్ - కేసీఆర్

Nikhat Zareen: గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్ – కేసీఆర్

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో, ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సిఎం కేసీఆర్ అభినందించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
వియత్నాం కు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సిఎం అన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయమని సిఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే వుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read : Boxing: నిఖత్, లవ్లీనాలకు గోల్డ్ మెడల్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్