Sunday, January 19, 2025
HomeTrending Newsరాహుల్ గాంధీపై కేటిఆర్ వ్యంగ్య విమర్శలు

రాహుల్ గాంధీపై కేటిఆర్ వ్యంగ్య విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్న ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ ఆ అంశంపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే హ‌క్కు రాహుల్‌కు లేద‌ని మంత్రి ఆరోపించారు.

ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని ఒప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. 2019లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్