Wednesday, March 18, 2026
Homeసినిమాకృష్ణంరాజు సంస్మరణ సభకు భారీగా తరలివచ్చిన అభిమానులు

కృష్ణంరాజు సంస్మరణ సభకు భారీగా తరలివచ్చిన అభిమానులు

ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఇవాళ  ఆయన స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు.  చాలా రోజుల తర్వాత  రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం చెప్పారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది.

స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ తిని వెళ్లమని కోరారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఉద్వేగపూరితంగా సాగింది.

Also Read : మొగల్తూరులో కృష్ణంరాజు స్మృతివనం: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular