Wednesday, March 11, 2026
HomeసినిమాMahesh Babu: గ్యాంగ్ స్టర్ గా మహేష్ బాబు?

Mahesh Babu: గ్యాంగ్ స్టర్ గా మహేష్ బాబు?

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. ఇలా వరుస విజయాలతో మహేష్ బాబు దూసుకెళుతున్నాడు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ అంటూ మాస్ మూవీ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ భారీ అంచనాలున్నాయి.

గుంటూరు కారం తర్వాతా

అయితే.. మహేష్ నెక్ట్స్ మూవీని రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాపు స్టార్ట్ చేయనున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహేష్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. మహేష్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నాడట. ఇంతకీ ఏ సినిమాలో అంటారా..? అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ సినిమాలో.

అదేంటి.. సందీప్ రెడ్డితో మహేష్ మూవీ అనౌన్స్ చేయలేదు కదా అనుకుంటున్నారా..? గత కొంతకాలంగా మహేష్ తో మూవీ చేయాలని సందీప్ రెడ్డి కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. మహేష్ కోసం ఓ కథ రాసుకున్నానని.. ఇందులో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని.. ఆ కథతో ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular