Friday, June 12, 2026
Homeసినిమామహేష్‌, త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

మహేష్‌, త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా  తర్వాత  హ్యాట్రిక్ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై  రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పటి వరకు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయలేదు. ఈ సినిమా గురించి లేటెస్ట్ గా యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ జనవరి 18 నుంచే తాజా షెడ్యూల్ మొదలవుతోందని  కన్ఫర్మ్ చేశారు.

ముందుగా ప్రకటించినట్లు ఆగస్ట్ 11 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా.. ఈ సినిమాలో పూజా హేగ్డే ఫస్ట్ హీరోయిన్ అని.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ “ఇద్దరికీ సమానంగా పాత్రలు ఉంటాయి. ఒకరు ఫస్ట్, ఇంకొకరు సెకండ్ అనే తేడాలు లేవు’  అంటూ క్లారిటీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular