తెలంగాణలో బీజేపీ తన వికృతరూపం వికృతరూపాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతన్‌కల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణ వాతావరణం, రాజాసింగ్ వ్యవహారం, బండి సంజయ్ దీక్షలు, మద్యం కుంభకోణం ఆరోపణలపై స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతల సమతుల్యం దెబ్బతీసి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. చట్టబద్ధ సంస్థలు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కావాలని రెచ్చగొట్టి ప్రతిదాడులు చేసేలా రెచ్చగొట్టి.. శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. కులాల మధ్య బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టంచేశారు. రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని, పథకం ప్రకారం మాట్లాడించి సస్పెన్షన్ చేసినట్లు నటిస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలపై ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దాడులే లక్ష్యంగా చేసుకుంటే టీఆర్‌ఎస్ ఎదుట బీజేపీ నిలువలేదన్నారు.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు