Wednesday, June 26, 2024
HomeTrending Newsటిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు - రేవంత్ రెడ్డి

టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు – రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆరెస్ గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ నుంచి నిధులు తెస్తామన్నారని, కానీ బీజేపీ నేతలు నమ్మించి మోసం చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి, టిఆర్ ఎస్ లపై ధ్వజమెత్తారు. దుబ్బాక, హుజూరాబాద్ లో ఉప ఎన్నికల తర్వాత ఏపాటి నిధులు తెచ్చారని బిజెపి నేతలను ప్రశ్నించారు. రఘునందన్, రాజేందర్ కు సవాల్ విసురుతున్న… మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపండని డిమాండ్ చేశారు. మీరు తెచ్చిన నిధుల లెక్క చెప్పండన్నారు. ఎనిమిదేళ్లయినా హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో అభివృద్ధి జరగలేదని, గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప టీఆరెస్ చేసిందేం లేదన్నారు. మునుగోడు బంగారుమయం కాలేదు.. గుంతల రోడ్ల మునుగోడుగా మార్చారన్నారు.

బంగారు తెలంగాణలో మునుగోడు లేదా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్తగా దత్తత పేరుతో కేటీఆర్ డ్రామాలడుతున్నాడని, కేసీఆర్ ను సీఎం చేసింది రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి కాదా అన్నారు. ప్రశిస్తున్న జనాన్ని రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తున్నాడని, ఓటు అడుక్కోవడానికి వచ్చి దౌర్జన్యం చేస్తావా అని మండిపడ్డారు. టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణ రాష్ట్రానికి లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తేనే భయంతో టీఆరెస్, బీజేపీలు ఇచ్చిన హామీలు అమలు చేస్తాయని, మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈరోజు ( 18 అక్టోబర్ 2022 మంగళవారం) చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు.

రూట్ మ్యాప్

5PM- తంగడపల్లి

6PM- లక్కారం

7PM- చౌటుప్పల్ కమాన్

8PM-మల్కాపురం

Also Read యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్