Thursday, March 19, 2026
Homeసినిమాఎన్టీఆర్ కి కోపం వచ్చేలా చేసిన వెంకీ, పవన్

ఎన్టీఆర్ కి కోపం వచ్చేలా చేసిన వెంకీ, పవన్

ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా అవార్డులు వస్తున్నాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకుంది. ఫస్ట్ టైమ్ ఆస్కార్ బరిలో నిలిచి కూడా చరిత్ర సృష్టించింది. ఈ రెంటితో పాటు  పలు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా  దక్కించుకుని సత్అంతా చాటుతోంది.  ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అమెరికాలో ఉంటూ ఆస్కార్ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్‌, కీరవాణి, ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ అమెరికాలోనే ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి  ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.   రామ్ చరణ్ స్టైలీష్ లుక్ లో  ఈ  అవార్డు వేడుకల్లో కనిపించి సందడి చేశారు.  రామ్ చరణ్‌ ను అభినందిస్తూ పవర్ స్టార్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ని మాత్రమే అభినందించి ఎన్టీఆర్ గురించి ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీ అంటే.  రామ్ చరణ్ తో  పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. ఇద్దరూ పోటాపోటీగా నటించబట్టే ఇంతటి విజయం దక్కింది. దీనిని మరచిపోయి చరణ్ ని మాత్రమే అభినందించారంటూ విమర్శలు కూడా వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఎన్టీఆర్ కి కోపం వచ్చేలా చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే… తాజాగా రామ్ చరణ్‌ అమెరికాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. అయితే.. అదే వేడుకలో టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఇక ఇద్దరూ ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సరదా సరదాగా గడిపారు. రామ్ చరణ్ ను చూసిన వెంకీ అవార్డులు అందుకున్న చరణ్ ను ఈ సందర్భంగా అభినందించాడు. అవార్డులు అన్నీ నీకే అంటూ వెంకీ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. దీనికి చెర్రీ.. వెంకీ మామకు థ్యాంక్స్ చెప్పాడు. పవన్, వెంకీ.. ఇలా ఎన్టీఆర్ ను మరచిపోవడం ఏంటో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read : ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ అయినా వస్తుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular