Sunday, March 8, 2026
Homeసినిమాఎన్టీఆర్ 30 సెట్స్ పైకి ఎప్పుడు?

ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి ఎప్పుడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నట విశ్వరూపం చూపించారు. దీంతో అతని నెక్ట్స్ మూవీ ఎవరితో? ఎప్పుడు వస్తుందని ఆతృతగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే..  డైరెక్టర్ కొరటాల శివతో  ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో తన సినిమా కథపై మరోసారి వర్క్ చేయమని ఎన్టీఆర్ శివకు సూచించారు. ఎట్టకేలకు కథ రెడీ అయ్యింది.

నవంబర్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుందనుకున్నారు  కానీ అది జరగలేదు, డిసెంబర్ లో అని వార్తలు వచ్చాయి. ఈ టైమ్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడంతో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడనేది ఆసక్తిగా మారింది.

అయితే.. తాజాగా ఓ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వున్న ఈ మూవీని జనవరి మిడ్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా స్టోరీగా ఈ మూవీ వుంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular