Thursday, September 19, 2024
Homeసినిమాభారీ ఛాన్సులు కొట్టేసిన ప్రియాంక అరుళ్ మోహన్! 

భారీ ఛాన్సులు కొట్టేసిన ప్రియాంక అరుళ్ మోహన్! 

తెలుగు తెరకి పరిచయమైన నాజూకైన భామలలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. 2019లోనే ఒక కన్నడ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలెట్టిన ప్రియాంక, ఆ తరువాత చాలా తక్కువ గ్యాప్ లోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె నుంచి వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ .. ‘శ్రీకారం’ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తెరపై చాలా సింపుల్ గా కనిపిస్తూ … విశాలమైన కళ్లతో విన్యాసాలు చేస్తూ ఈ బ్యూటీ కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంది.

టాలీవుడ్ ఎంట్రీ ఈ సుందరికి కలిసి రాకపోయినా, కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం పెద్ద హిట్లనే కట్టబెట్టింది. శివ కార్తికేయన్ జోడీగా ప్రియాంక చేసిన ‘డాక్టర్’ సినిమా ఆమె కెరియర్లో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇక అప్పటి నుంచి తమిళంలో ఆమెకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తమిళంలో ధనుశ్ తో కలిసి ఆమె నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక కోలీవుడ్ లో విజయ్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. విజయ్ 68వ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ జోడీగా ప్రియాంక కనిపించనుంది. ఇక అలాగే తెలుగులో నాని 31వ సినిమాలో హీరోయిన్ గాను ఎంపికైంది. ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లింది. ఈ రెండు సినిమాలు నిన్ననే పూజా కార్యక్రమాలను జరుపుకోవడం విశేషం.  ఈ సినిమాల తరువాత తెలుగు .. తమిళ భాషల్లో ప్రియాంక జోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్