Wednesday, March 11, 2026
Homeసినిమాపూరికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

పూరికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉందని ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇటీవలే పూరి.. చిరంజీవికి అదిరిపోయే లైన్ వినిపించారుట. చిరు ఆ లైన్ విని చాలా ఇంప్రెస్ అయ్యారట. ఇంకెందుకు ఆలస్యం బౌండెడ్  స్ర్కిప్ట్ రెడీ చేయండని చెప్పేశారని తెలిసింది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అని సమాచారం.

పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందట. చిరు అక్కడే లాక్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే.. పూర్తి కథతోనూ చిరంజీవిని మెప్పించాల్సి  ఉంది. లైన్ వినిపించి లాక్ చేసేద్దాం? అంటే కుదరదు. పక్కాగా చిరుని 200 శాతం మెప్పించి.. వెంటనే సినిమా మొదలు పెట్టాలి. పూరి ముందున్న అతి పెద్ద టాస్క్ ఇది. ఈసారి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇప్పటికే లైగర్ ప్లాప్ తో నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చిరుతో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular