Friday, March 13, 2026
Homeసినిమాదుబాయ్ లో మ‌హేష్‌, జ‌క్క‌న్న

దుబాయ్ లో మ‌హేష్‌, జ‌క్క‌న్న

Discussions – Dubai: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ మూవీని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇక మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో మూవీ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత రాజ‌మౌళితో మ‌హేష్ మూవీ చేయ‌నున్నారు.

అయితే.. మ‌హేష్, రాజ‌మౌళి ఈరోజు దుబాయ్ వెళ్లారు. దీంతో వీరిద్ద‌రూ దుబాయ్ ఎందుకు వెళ్లార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. క‌థా చ‌ర్చ‌లు కోస‌మే వీరిద్ద‌రూ దుబాయ్ వెళ్లార‌ని స‌మాచారం. యాక్షన్ అడ్వెంచర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్. నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

Also Read : రాజ‌మౌళి స‌రికొత్త రికార్డ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular