Thursday, March 19, 2026
Homeసినిమాతండ్రీకొడుకుల మధ్య జరిగే ఘర్షణగా 'రానా నాయుడు' 

తండ్రీకొడుకుల మధ్య జరిగే ఘర్షణగా ‘రానా నాయుడు’ 

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేశ్ ఒకరు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ఆయన ట్రై చేస్తుంటారు. ఇక రానా కూడా మొదటి నుంచి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ  వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి వెండి తెరపై కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలా కాలంగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అలా అభిమానుల ముచ్చట తీర్చే అవకాశం వారికి వెబ్ సిరీస్ తో రావడం విశేషం. ఆ వెబ్ సిరీస్ పేరే ‘రానా నాయుడు’.

రానా తన పేరుతో ఉన్న పాత్రనే పోషించడం .. వెంకటేశ్ కి కొడుకుగా నటించడం ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ వెబ్ సిరీస్ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ వారు నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇటు వెంకటేశ్ .. అటు రానాపై పాత్రలకి సంబంధించిన విభిన్నమైన కోణాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. తండ్రీకొడుకులకు ఎంతమాత్రం పొసగకపోవడం .. తండ్రిని కొడుకు ద్వేషించడం ఈ ట్రైలర్ లో కనిపించింది.

ఒక వైపున ముంబైలోని అరాచక శక్తులతో చేతులు కలిపిన రానా .. మరో వైపున తన కుటుంబ సభ్యుల నుంచే ఆదరణ కరువైన వెంకటేశ్ పాత్రలు చూస్తుంటే, ఈ ఇద్దరి మధ్య  అసలు ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు రొమాన్స్  కి కూడా చోటిచ్చారనే విషయం  అర్థమవుతోంది. నిర్మాణ విలువలు ఒక రేంజ్ లోనే కనిపిస్తున్నాయి. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular