మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రావణాసుర’ వేసవిలో విడుదల కానుంది.
ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్, రెండవ సింగిల్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. ఏప్రిల్ 7న రావణాసుర ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.