Tuesday, March 17, 2026
HomeTrending Newsక్రీడాకారులకు అన్యాయం: లోకేష్

క్రీడాకారులకు అన్యాయం: లోకేష్

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో నడుస్తోన్న వివిధ ఆట స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టర్ ద్వారా లోకేష్ స్పందించారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నాలుగు బ్యాడ్మింటన్, ఒక స్కేటింగ్ రింక్ లను లీజుకు ఇచ్చేందుకు జారీ చేసిన ప్రకటనను జత చేస్తూ ఈ నిర్ణయంపై  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

“జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారుల పట్ల శాపంగా మారింది. పేద క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న గ్రౌండ్స్ ని శాప్ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శాప్ ఆధ్వర్యంలోని 52 బ్యాడ్మింటన్, 10 టెన్నిస్ కోర్టులు, 4 స్కేటింగ్ రింగ్లను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి పేద క్రీడాకారులకు తీరని అన్యాయం చేస్తోంది వైసిపి ప్రభుత్వం.  ఈ ప్రక్రియ వలన క్రీడాకారులు ఫీజులు చెల్లించలేక క్రీడలకు దూరమయ్యి తద్వారా రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉంది.నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకూ ఎటువంటి సాయం అందించకుండా వేధించారు.ఇప్పుడు ఏకంగా పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు. శాప్ లో అర్హత,  క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకుని అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరాలు పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయి?” అంటూ విమర్శలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular