Sunday, June 7, 2026
Homeసినిమావీరయ్యతో పోటీకి సై అంటున్న బాలయ్య.

వీరయ్యతో పోటీకి సై అంటున్న బాలయ్య.

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య‘,   మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చాలా గ్యాప్ తరువాత చిరంజీవి ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

అటు వాల్తేరు వీరయ్య, ఇటు వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి పోటీపడుతుండడం ఆసక్తిగా మారింది. బాలయ్య సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ బాలయ్య మాత్రం పోటీకి సై అంటూ సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారట.

విచిత్రం ఏంటంటే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలను ఓకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం విశేషం. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిరావడంతో నిర్మాతలకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య మూవీ డేట్ ను బట్టే వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular