Thursday, March 19, 2026
Homeసినిమాసంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫస్ట్ లుక్ విడుదల

సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫస్ట్ లుక్ విడుదల

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాల్లో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం హీరో సంతోష్ శోభన్‌తో  ఒక సినిమా చేస్తున్నారు గాంధీ. గతంలో సంతోష్ నటించిన ’ ఏక్ మినీ కథ’ కు మేర్లపాక కథ, స్క్రీన్ ప్లే అందించారు. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.

ఈ సినిమాలో సంతోష్ శోభన్ కు జోడిగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్‌’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ‘ అనే క్రేజీ టైటిల్ ను ప్రకటించారు.

ఇవి యూట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ అడవిలో, టాప్ యాంగిల్‌లో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే సినిమా కథ చాలా విలక్షణంగా ఉండబోతోందని అర్ధమౌతోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

Also Read : నేను వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను : సంతోష్ శోభన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular