Monday, June 15, 2026
HomeTrending Newsతిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం - వైఎస్ షర్మిల

తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం – వైఎస్ షర్మిల

పైన పటారం.. లోన లోటారం… ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలట్లేదాని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు కాగా ఇప్పుడు అప్పు 4.50 లక్షల కోట్లు అన్నారు. దొర చేసిన అప్పులకు 8న్నర ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు…ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా అని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి డబ్బుల్లేవ్. ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్ లేవ్.. ఏ పథకానికి నిధుల్లేవ్….ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు.

రాష్ట్ర సంపద తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం అని వైఎస్ షర్మిల విమర్శించారు. మీ పార్టీ అకౌంట్ లో 860కోట్లకు వడ్డీలు మీరు తినాలే.. రాష్ట్ర అప్పులకు వడ్డీలు జనాలు కట్టాల్నా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకుతింటుండు దొర అన్నారు. చక్ర వడ్డీలతో చక్రం తిప్పి, ఒక్కో నెత్తిన లక్షన్నర అప్పు పెట్టి…రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి..బంగారు తెలంగాణ చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోడానికి కెసిఆర్ పోతుండని వైఎస్ షర్మిల వ్యగ్యంగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular