Tuesday, March 17, 2026
Homeసినిమాజనవరి 26న 'హంట్' విడుదల

జనవరి 26న ‘హంట్’ విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు నిర్మాత వెల్లడించారు. ‘హంట్’ విడుదల తేదీని వెల్లడిస్తూ… సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుధీర్ లుక్ & కళ్ళలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… “మా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు అందరినీ సినిమా అలరిస్తుంది. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. సినిమా రెడీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular