Saturday, June 13, 2026
HomeTrending Newsసిఎం విమానంలో సాంకేతికలోపం

సిఎం విమానంలో సాంకేతికలోపం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. మార్చి 2,3 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  జరుగనుంది. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం రేపు మంగళవారం ఉదయం ఢిల్లీ లోని లీలా ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేశారు. విశాఖ సమ్మిట్ లో పాల్గొంటున్న పలువురు పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ భేటీలో సిఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. దీనికోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.

టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.  గన్నవరం నుండి తిరిగి తాడేపల్లికి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. అయన రేపటి ఢిల్లీ టూర్ పై కాసేపట్లో స్పష్టత  రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular