Tuesday, March 17, 2026
Homeసినిమా'ఏజెంట్'కి బడ్జెట్ అంతయ్యిందా?

‘ఏజెంట్’కి బడ్జెట్ అంతయ్యిందా?

అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.  చివరకు  సంక్రాంతికి ఏజెంట్ అని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతికి కూడా  ఏజెంట్ రావడం లేదని తెలిసింది. ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ అంటున్నారు. దీంతో అసలు ఎందుకు ఏజెంట్ ఇన్ని సార్లు వాయిదా పడుతుంది.? ఏం జరుగుతుందని అభిమానులు, సినీ జనాలు ఆరా తీస్తున్నారు. ఈ సినిమాకు 40 కోట్ల బడ్ఙెట్ అని రంగంలోకి దిగారు. అఖిల్ రేంజ్ కు ఆ బడ్జెట్ ఎక్కువే అని తెలిసినా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్. పైగా ఆయన కూడా భాగస్వామి కదా అని దిగారు.

ఆతర్వాత బడ్జెట్ కంట్రోలు తప్పడం మొదలైంది. అదే టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తనకు భాగస్వామ్యం వద్దన్నారు కానీ అలా అని సహ నిర్మాతగా ఆయన భార్య పేరు అయితే అలాగే వుండాలన్నారు. బడ్ఙెట్ అలా అదుపుతప్పి 80 కోట్లకు చేరుకుంది. అఖిల్ మీద 80 కోట్ల బడ్ఙెట్ సినిమా అంటే నిర్మాత పెద్ద సాహసమే చేస్తున్నట్టు లెక్క. ఇలాంటి టైమ్ లో సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే రెండు విధాలా బాగుంటుందని నిర్మాత అనిల్ సుంకర ఆలోచన. కానీ.. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో సంక్రాంతికి రావడం కుదరడం లేదట. మరి.. ఎప్పటికి కంప్లీట్ అవుతుందో..? ఎప్పుడు రిలీజ్ అవుతుందో..?

Also Read  ఏజెంట్ నిజంగా సంక్రాంతికి వస్తుందా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular