Friday, March 13, 2026
HomeTrending NewsKollur: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం

Kollur: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునాతన సౌకర్యాలతో పేదల కోసం కొల్లూరు లో నిర్మించిన 15వేల60 ఇండ్ల సముదాయాన్ని ఈనెల 22న సీఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొనున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొల్లూరులో సీఎం డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రారంభానికి అన్ని విధాలా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ పై చర్చించి పలు సూచనలు చేశారు.

కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం (రెసిడెన్షియల్ కాంప్లెక్స్) గా, ఆసియా మోడల్ గా నిలువనుందని మంత్రి పేర్కొన్నారు. పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు సీఎం కేసిఆర్ కొల్లూరు గృహ సముదాయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పేదల కోసం 100 శాతం సబ్సిడీతో పూర్తి ఉచితంగా కేసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న ఇండ్లు ఇవి అన్నారు. గతంలో కాగితాల్లో ఇండ్లు చూపించే వారు లక్షల రూపాయలు బిల్లులు డ్రా చేసుకునే వారు కానీ నేడు కండ్లకు సాక్షాలుగా డబుల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని 6గురు లబ్దిదారులకు ఇంటిపట్టా అందజేస్తారనీ తెలిపారు. నిర్మాణ సముదాయంలో సుమారు 50 నుంచి 60వేల మంది ఉండే ఆస్కారం ఉన్నందున 103 షాపింగ్ కాంప్లెక్స్ లు, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్,లిఫ్ట్ లు,మంచినీళ్లు,డ్రైనేజీ ,రోడ్లు, అన్ని రకాల మౌళిక సదుపాయాలు ఉంటాయని మంత్రి వివరించారు. భవిష్యత్ కొల్లూరు లోని ఈ ప్రాంతం మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉందన్నారు.

మంత్రి వెంట HMDA కమిషనర్ అరవింద్ కుమార్,GHMC కమిషనర్ లోకేష్,సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర,గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular