Saturday, June 13, 2026
Homeసినిమావాల్తేరు వీరయ్య టైటిల్ వెనకున్న అసలు కథ ఇదే

వాల్తేరు వీరయ్య టైటిల్ వెనకున్న అసలు కథ ఇదే

చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ వాల్తేరు వీరయ్య పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయని చెప్పచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే… మొదట ఈ సినిమాకి బాబీ అనుకున్న టైటిల్ వాల్తేర్ శీను. అయితే.. చిరంజీవి తన పాత్ర పేరుని శీను నుంచి వీరయ్యగా మార్చారట. ఎందుకంటే చిరంజీవి జీవితంలో వీరయ్య అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారట. అందుకే ఆయనికి నివాళిగా తన పాత్ర పేరును, సినిమా టైటిల్ ని వీరయ్యగా మార్చారని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తండ్రి ఒక కానిస్టేబుల్. అప్పట్లో చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్. చదువుకునే రోజుల్లోనే నటన పైన ఆసక్తి ఏర్పడింది.

చిరంజీవి ఫేస్ కటింగ్, డ్యాన్సులు చూసి మీ వోడు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తాడయ్యా.. అని చిరంజీవి త్రండికి ఆయన స్నేహితుడు వీరయ్య చెప్పారట. అలా చిరంజీవి యాక్టింగ్ కెరీర్ కి అక్కడ బీజం పడింది. అప్పట్లో వీరయ్య మాట వల్లే తాను సినిమాల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది అని చెబుతుంటారు చిరంజీవి. అందుకే.. ఇప్పుడు ఆయనకి నివాళిగా సినిమాకి టైటిల్ గా వీరయ్య పేరు పెట్టుకున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వాల్తేరు వీరయ్య హాట్ టాపిక్ అయ్యింది. మరి.. ఈ టైటిల్ పెట్టడం గురించి చిరంజీవి స్పందిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular