Monday, June 15, 2026
Homeసినిమాడీ గ్లామర్ రోల్స్ దిశగా గ్లామరస్ హీరోయిన్స్!

డీ గ్లామర్ రోల్స్ దిశగా గ్లామరస్ హీరోయిన్స్!

హీరోయిన్ అంటే అందంగా ఉండాలి .. అందంగా కనిపించాలి .. అందంగా అనిపించాలి. సమాజం కోసం పోరాడి అలసిపోతున్న హీరోను పాట ద్వారా సేదదీర్చాలి .. విలన్ గ్యాంగ్ ను ఆయన ఎదుర్కోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇవ్వాలి. మిగతా సమయంలో హీరోయిన్ ఎక్కడికి వెళ్లిందీ .. ఏం చేస్తున్నది ప్రేక్షకులు పట్టించుకోరు. తమ హీరో జోడీగా ఆమె అందాల సందడి చేసిందా లేదా అనేదే వారికి కావలసింది.

అలాంటి హీరోయిన్స్ అందంగా కనిపించకపోతే ఆడియన్స్ ఉస్సూరు మంటారు. అయినా హీరోకి తగినట్టే కదా హీరోయిన్ ఉండాలి అనుకుంటూ చాలామంది హీరోయిన్స్ కథను బట్టి డీ గ్లామర్ రోల్స్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు. అవసరమైతే రంగు తగ్గుతున్నారు .. బరువు తగ్గుతున్నారు .. మాసి పోయినట్టుగా అనిపించే బట్టలు వేసుకుంటున్నారు. ఇలాంటి పాత్రలలో చేయడానికి ఒకప్పటి హీరోయిన్స్ అంతగా ఒప్పుకునేవారు కాదు .. కానీ ఇప్పటి హీరోయిన్స్ ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నారు.

ఆ మధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత, ఆ కథ  నేపథ్యానికి తగినట్టుగా పల్లెటూరి యువతిగా కనిపించింది. మేనిఛాయను తగ్గించుకుని మరీ ఆ పాత్రలో మెప్పించింది. ఇక అదే దర్శకుడు తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక కూడా డీ గ్లామర్ గా కనిపించింది. బంగారం లాంటి మేనిఛాయకి కాస్త మట్టి రంగు రాసుకుని, శ్రీవల్లి పాత్రకి న్యాయం  చేసింది. ఇక ఇప్పుడు కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ‘దసరా‘ సినిమాలో నాని జోడీగా .. పల్లెటూరి పిల్లగా ఆమె అలరించనుంది. వెన్నెల పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తుందన్నది ఈ నెల 30న తెలియనుంది. మొత్తానికి గ్లామరస్ భామలంతా డీ గ్లామర్ రోల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular