Thursday, March 12, 2026
Homeసినిమాఅదే జరిగితే ..  టాలీవుడ్ లో త్రిష మళ్లీ బిజీనే!

అదే జరిగితే ..  టాలీవుడ్ లో త్రిష మళ్లీ బిజీనే!

టాలీవుడ్ తెరపై సందడి చేసిన అందమైన కథానాయికలలో ‘త్రిష‘ ఒకరు. సాధారణంగా కథానాయికలు తమ జోరును కొంతకాలం వరకూ మాత్రమే కొనసాగించగలుగుతారు .. గ్లామర్ తగ్గగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు అని చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది విషయంలో అలా జరిగింది కూడా. కానీ త్రిష ఆ విషయాన్ని బ్రేక్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటినా ఇంకా ఆమె తన హవాను కొనసాగిస్తూనే వుంది. ఎప్పుడూ ఒక అరడజను సినిమాలు చేతిలో పట్టుకునే ఉంటోంది. కోలీవుడ్ లో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది.

తెలుగు .. తమిళ భాషల్లోనే త్రిష వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. రెండు భాషల్లోను స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అడపా దడపా మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లోను మెరిసింది. అలాంటి త్రిష తెలుగు సినిమాకి దూరమై చాలాకాలమే అయింది. తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ .. సీనియర్ స్టార్ హీరోల జోడీకడుతూ వెళుతోంది. అలాంటి త్రిష తాజా చిత్రంగా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి  ‘పొన్నియిన్ సెల్వన్’ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది.

ఈ సినిమాలో జయం రవి చెల్లెలి పాత్రలో త్రిష కనిపించనుంది. ‘కుందవై’ అనే ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం అంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో .. అందునా భారీ చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో చేసే అవకాశం రావడం తన అదృష్టంగా త్రిష భావిస్తోంది. ఇక ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో చేయడం మరో అదృష్టమంటూ ప్రమోషన్స్ లో హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో ఆమె ఉంది. అదే జరిగితే టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నాయికగా ఆమె బిజీ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయనడంలో సందేహం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular