Monday, January 20, 2025
HomeTrending Newsటీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు - ఎంబిసి నేతలు

టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు – ఎంబిసి నేతలు

విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఇలా అన్ని రంగాల్లో అత్యంత వెనకబడిన కులాలు,భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్న కులాలు ఉన్న బీసీ ఏ గ్రూప్ లోకి,అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన,అత్యధిక జనాభా కలిగిన, బీసీ డి లో ఉన్న అత్యంత బలమైన కులం ముదిరాజ్ కులాన్ని కలపడం అన్యాయమని ఎంబిసి కులాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ ఏ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులని కాలరాయడమే అవుతుందన్నారు. BC-D లో ఉన్న ముదిరాజ్ కులాన్ని BC-A లోకి ఎట్టిపరిస్థితుల్లో కలపవద్దు అని BC-A లో అన్ని కులాల వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక వేళ ముదిరాజ్ కులాన్ని బీసీ ఏ లో కలిపే విధమైన ఆలోచనలు చేస్తే, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి బీసీ ఏ కులాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా చేర్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.  బీసీ-ఎ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏ.ఎల్.మల్లయ్య గంగపుత్ర, ప్రొ.ఎం.భాగయ్య నాయీ భవిష్యత్తు కార్యాచరణ కొరకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితికి కన్వీనర్ గా మానస గణేష్ రజకని ప్రకటించారు. ఈ పత్రికా సమావేశంలో ఓయూ జేఏసి అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతు… ముదిరాజ్ కులానికి ఏ ఒక్క బిసి-ఎ కులం వ్యతిరేకం కాదని కానీ ఆర్థిక,సామాజిక,రాజకీయ అసమానతలు గల బిసి-ఎ కులాల అభివృద్ధి ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని బీసీలలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులాన్ని బీసీ-ఎ లో చేర్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముదిరాజ్ కులాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుని ఇతరులకు అన్యాయం చేయటం తగదని హెచ్చరించారు. త్వరలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని బీసీ ఏ కులాల ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఓయూలో జరిగే సమావేశంలో బీసీ ఏ రిజర్వేషన్ పరిరక్షణ సమితి యొక్క రాష్ట్ర కమిటీ మరియు జిల్లాల కన్వీనర్లను ఎన్నుకొని దీర్ఘకాలిక కార్యాచరణతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.  బీసీ ఏ గ్రూప్ లోకి ముదిరాజ్ కులాన్ని కలపరాదని విజ్ఞప్తి చేస్తూ…బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్ కి బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్,సీహెచ్ ఉపేందర్ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో A.L.మల్లయ్య గంగపుత్ర,ప్రొ.భాగయ్య,బీసీ ఏ రిజర్వేషన్ పరిరక్షణ కన్వీనర్ మానస గణేష్,డా.ఎల్చల దత్తాత్రేయ ఓయు జేఏసి అధ్యక్షులు,గోపి రజక, మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర, అబ్బులింగం, కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, దశరథ్, శేఖర్ వడ్డెర, పల్లికొండ నర్సయ్య గంగపుత్ర, గోపి బోయ, లక్ష్మణ్ రావ్ బుడబుక్కల, ఎంబీసీ నరహరి, మానస గణేష్, నగేష్ బొప్పల, యుగంధర్ మేరు, పూస శ్రీనివాస్, డా.సంగెం శ్రీను, చిత్తరాంజన్, భాస్కర్, రమేష్, సునీల్, రాసకట్ల దీపక్, రాకేష్, రాజు పెద్ద సంఖ్యలో బిసి-ఎ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్